కీసర, ఏప్రిల్ 20; క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నగరంలోని బోయినపల్లికి ప్రణీత్ (32) తన తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం రాంపల్లిదాయరలోని మైదానానికి వచ్చారు. క్రికెట్ ఆడుతుండగా ప్రణీత్‌కు అకస్మాత్తుగా శ్వాస ఆడకుండా పోయింది.
ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలకొరిగి అపస్మారక స్థితిలోకి చేరాడు. వెంటనే 108లో దవాఖానకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రణీత్ చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.