Rain Update | మరో రెండు రోజులు వర్షం.. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్‌లో 1.75 , వనస్థలిపురంలో 1.40సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
Rain Update | సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్‌లో 1.75 , వనస్థలిపురంలో 1.40సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. దీంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.4డిగ్రీలు, గాలిలో తేమ 65 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
దామగుండాన్ని రక్షించుకుందాం..
దామగుండం అటవీ ప్రాంతాన్ని కాపాడాలని ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు పలువురు పర్యావరణ ప్రేమికులు మద్దతు తెలిపారు.

‘పన్నెండు లక్షల చెట్ల నరికివేతను అడ్డుకుందాం..దామగుండాన్ని కాపాడుకుందాం’, ‘పచ్చదనాన్ని కాపాడండి.. పసిపిల్లలకు ఊపిరివ్వండి’ అంటూ పర్యావరణ ప్రేమికులు ప్లకార్డులు చేతబూనారు. ఇందులో భాగంగా ఓ పర్యావరణ ప్రేమికుడు తులసి మొక్కకు ఆక్సీజన్ పైపు బిగించి వినూత్నంగా ఇలా నిరసన తెలిపాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

