ఎంజీబీఎస్‌లో గుర్తు తెలియని మహిళ మృతి
మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
సుల్తాన్‌బజార్,మే 15: మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ ఎస్ఐ జగదీశ్ కథనం ప్రకారం.. ఎంజీబీఎస్‌లోని ప్లాట్ఫారం నంబర్ 33 వద్దనున్న వెయిటింగ్ సీట్లో దాదాపు 40 ఏండ్ల వయసున్న గుర్తు తెలియని ఓ మహిళ చనిపోయి ఉన్నది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు.
ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బస్టాండులో ఉన్న ఎవరు కూడా ఆమెను గుర్తించలేదు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలు పసుపు, ఆకుపచ్చ రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి ఉన్నదని ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిస్తే అఫ్జల్‌గంజ్ పీఎస్ లేదా 8712515489/8712660534 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

