తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఇసుక పంచాయితీ కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పు గార్లపాడు గ్రామ శివారులో పారుతున్న తుంగభద్ర నది నుంచి మన ప్రభుత్వం ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చింది.
మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.