Musi River | హైదరాబాద్ : అంబర్‌పేట డంప్ యార్డు వద్ద మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి ఒంటి నిండా కేబుల్ వైర్లు చుట్టుకొని ఉన్నాయి. అయితే ఆ యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక హత్యకు గురయ్యాడా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అతను భవన నిర్మాణరంగంలో వర్కర్‌గా పని చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.