బంజారాహిల్స్/కాప్రా, సెప్టెంబర్ 23: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళి అర్పించాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రమణ అన్నారు. మంగళవారం శ్రీనగర్ కాలనీ డివిజన్ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించడం కోసం కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి
సునీతాగోపీనాథ్ను గెలిపించాలంటూ కుమార్తె అక్షర ఇంటింటి ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కడకు వెళ్లినా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించిన బహుమతులను చూపిస్తున్న మహిళలు, తమకు గత ప్రభుత్వంలో దక్కిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటున్నారు. మంగళవారం షేక్‌పేట డివిజన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మాగంటి అక్షర పలువురు
ఓటర్లను కలిసి రానున్న ఎన్నికల్లో మద్దతు పలకాలని కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.