హైదరాబాద్ కృష్ణా నగర్లో ఏటీఎంలో చోరీకి యత్నం
ఏటీఎంలో చోరీ | కృష్ణా నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం.. ఇలా వరుస ఘటనలు హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు

హైదరాబాద్ : మొన్న కూకట్‌పల్లిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద దొంగతనం, నిన్న గండిమైసమ్మ వద్ద ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు గోడకు కన్నం.. నేడు కృష్ణా నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం.. ఇలా వరుస ఘటనలు హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కృష్ణానగర్‌లోని పంజాబ్ నేషన్ బ్యాంకు ఏటీఎం వద్దకు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఓ యువకుడు బైక్‌పై వచ్చాడు. ఆ తర్వాత స్క్రూ డ్రైవర్లతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అంతలోనే పోలీసు పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో అప్రమత్తమైన ఆ దొంగ.. బైక్‌పై పరారీ అయ్యాడు. విషయాన్ని గమనించిన పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే దొంగ ఎస్ఆర్ నగర్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఏటీఎం టెక్నిషీయన్‌గా పని చేసిన యువకుడే ఈ చోరీకి యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్‌ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

