Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
సోషల్ మీడియాలో పరిచయమయ్యారు..! ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది..! ఆ ప్రేమే ఇద్దరినీ మూడుముళ్ల సాక్షిగా ఒకటి చేసింది. వారి వైవాహిక బంధం కొంతకాలం సజావుగానే సాగింది. వీరికి సంతాన యోగ్యం దూరమైంది.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 6: సోషల్ మీడియాలో పరిచయమయ్యారు..! ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది..! ఆ ప్రేమే ఇద్దరినీ మూడుముళ్ల సాక్షిగా ఒకటి చేసింది. వారి వైవాహిక బంధం కొంతకాలం సజావుగానే సాగింది. వీరికి సంతాన యోగ్యం దూరమైంది. కొంతకాలంగా కర్కషుడిగా మారిన ఆమెను వేధించసాగాడు. చివరిదాకా తోడుంటానని తన భార్యకు మాటిచ్చాడు. కానీ చివరికి కట్టుకున్నోడి చేతిలోనే “చితి”కిపోయింది ఆ అమాయకురాలు. ప్రేమించి పెళ్లాడిన భార్యనే ఏఆర్ కానిస్టేబుల్ అతి దారుణంగా హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. టేకులపల్లికి చెందిన నరేందర్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో పరిచయమైన భవానీని రెండేళ్ల క్రితం నరేందర్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిది నెలల క్రితం ఓ బాబు జన్మించి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా నరేందర్ భవానీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలోనే నరేందర్ రెండు రోజుల క్రితం భవానీని అతి దారుణంగా హత్య చేసి, ఓ సంచిలో మూట కట్టి తీసుకెళ్లి ఆమె మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం బయటికి రాకముందే ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ త్రీ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు ఏం జరిగింది..? సదరు ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యని హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి..? గోదావరిలో పడేసిన భవాని మృతదేహం లభించిందా లేదా..? అనే పూర్తి విషయాలను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
Namaste effect | గౌతమ్పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

