Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
గౌతమ్‌పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచ్ కళ్యాణి స్పందించారు.
చుంచుపల్లి, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపపల్లి గౌతమ్‌పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచ్ కళ్యాణి స్పందించారు. స్మశాన వాటికలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపునకు గ్రామపంచాయతీ సర్పంచ్ కళ్యాణి మరమ్మతులు చేయించడంతో పాటు, దాని చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు.
దీపావళి సందర్భంగా సమాధుల వద్దకు వెళ్లే కుటుంబాలతో పాటు, అంత్యక్రియల సమయంలో నీటి సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన నమస్తే తెలంగాణకు, వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన గ్రామపంచాయతీ సర్పంచ్ కళ్యాణికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే స్మశాన వాటికకు వెళ్లే రహదారికి సీసీ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆ సమస్యను కూడా అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

