Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Dhirendra Shastri: ఆధ్యాత్మిక మతప్రబోధకుడు ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో కేసు నమోదు అయ్యింది. పరువునష్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. శ్రీ కృష్ణ భగవానుడిపై ధీరేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ లాయర్ తెలిపారు.
ఆగ్రా: ఆధ్యాత్మిక మతప్రబోధకుడు ధీరేంద్ర శాస్త్రి(Dhirendra Shastri)పై ఆగ్రాలో కేసు నమోదు అయ్యింది. పరువునష్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. శ్రీ కృష్ణ భగవానుడిపై ధీరేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ లాయర్ తెలిపారు. అడ్వకేట్ అజయ్ ప్రతాప్ సింగ్ .. ఆగ్రా సివిల్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కృష్ణుడి గురించి శాస్త్రి అనుచితంగా మాట్లాడినట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. ఆ వ్యాఖ్యలతో కృష్ణుడిని ఆరాధించేవారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మధ్య శారీరక పోలికలపై శాస్త్రి కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో రామకథ కార్యక్రమ సమయంలో ఈ ఘటన జరిగింది.
కృష్ణుడిని ఫాలో అయ్యేవారు బాధపడుతారని, కానీ కృష్ణుడు మోసగాడని, ఆయన నిలబడినప్పుడు మూడు వైపుల వంగుతాడని శాస్త్రి తన ప్రవచనంలో విమర్శించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మానవ రూపంలో జన్మించారని, ఆయన అనువంశీకులు భారత్‌లో ఇంకా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. జాదూన్లు, జడేజాలు, భట్టిలు.. కృష్ణుడు వారస వర్గీయులే అని శాస్త్రి వ్యాఖ్యానించారు. తన తండ్రి వైపు నుంచి తాను కూడా కృష్ణుడు వంశస్తుడినే అని పేర్కొన్నారు. సివిల్ జడ్జీ కాంచన్ కుమార్ ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. అయితే ఆధ్యాత్మిక వేత్తలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదు అని తాజాగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

