Road Accident | హైదరాబాద్ : గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.
అయితే మృతురాలు పదో తరగతి పరీక్ష రాసి తన్న అన్నతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న వీరి బైక్.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు కింద పడింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని ప్రభాతి ఛత్రియ(16)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ యువకుడు సుమన్ ఛత్రియను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్.. బస్సు కింద పడి 10వ తరగతి విద్యార్థిని మృతి
పదో తరగతి పరీక్ష రాసి గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు వెళ్తుండగా, ఫ్లైఓవర్ మీద ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు కింద పడ్డ విద్యార్థిని ప్రభాతి ఛత్రియ (16)
అన్న సుమన్ ఛత్రియతో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం… pic.twitter.com/UKagfTzirT
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2025