హైదరాబాద్ : నగరంలోని హుమాయున్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూగ, చెవిటి మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌నగర్ కాలనీకి చెందిన సాయి అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో బాధితురాలి ఇంట్లోకి వెళ్లి బలవంతంగా వాష్ రూంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నేరం చేసిన తర్వాత సాయి వాష్‌రూంలోనే బంధించి తలుపులు వేసి పరారయ్యాడు. మహిళ మూగరాలు కావడంతో సహాయం కోసం అరవలేకపోయింది. కాగా, ఘటన జరిగినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దవాఖానలో చేరిన బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చని భర్త ఏమైందని అడుగడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుమయూన్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.