Hyderabad | హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో రైస్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. మూడు నెలల క్రితం గచ్చిబౌలిలో ఈ కంపెనీ తమ బ్రాంచ్‌ను ప్రారంభించింది. దేశంలో ఐదు నగరాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసినట్లు చూపి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించింది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 50 వేలు వసూలు చేసింది. ఇప్పుడు కంపెనీ మూసేశామని ఉద్యోగులకు యాజమాన్యం చెప్పింది. సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుని మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.