Accident | హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ – సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్.. ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి భక్తులు, వాహనదారులు తృటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ కుమార్ నాయక్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తరుచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.
సీసీటీవీ ఫుటేజ్
ఉప్పల్ – సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి జెన్పాక్ట్ కంపెనీ ఎదుట రోడ్డు మధ్యలో ఉన్న హనుమాన్ దేవాలయంలోకి దూసుకెళ్లిన సెప్టిక్ ట్యాంకర్
తృటిలో తప్పించుకున్న భక్తులు, వాహనదారులు
తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ కుమార్ నాయక్‌ను చికిత్స నిమిత్తం గాంధీ… pic.twitter.com/KtX7d7tPxn
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2025