Ganja | హైదరాబాద్ : గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ సర్కార్ పదేపదే చెబుతున్నప్పటికీ.. మరో వైపు గంజాయి బ్యాచ్ చెలరేగిపోతోంది. గంజాయికి బానిసైన వారు.. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదు. అందుకు తాజాగా పాతబస్తీలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం.
పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్లో రౌడీషీటర్ గంజాయి మత్తులో విధ్వంసం సృష్టించాడు. కత్తితో స్థానికులపై, వాహనదారులపై దాడులకు పాల్పడుతూ.. భయానక వాతావరణం సృష్టించాడు. కత్తితో పలు వాహనాలను ధ్వంసం చేశాడు. మొత్తంగా ఓ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఆ రౌడీషీటర్ ప్రవర్తనకు స్థానికులు భయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీషీటర్ నసీర్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్లో గంజాయి మత్తులో రౌడీషీటర్ హల్చల్
పాతబస్తీ ఐ.ఎస్ సదన్ పీఎస్ పరిధిలోని నెహ్రూ నగర్లో కత్తితో రోడ్డుపై వెళ్లే వారిపై దాని చేసిన రౌడీషీటర్ నసీర్
కత్తితో పలు వాహనాలను ధ్వంసం చేసిన నసీర్
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నసీర్ కోసం గాలిస్తున్న పోలీసులు pic.twitter.com/tItgDIiQqX
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025