Sivankutty | ఈయన పేరు శివన్కుట్టి.. రిటైర్డ్ ఆర్మీ అధికారి.. వయస్సు 75 ఏండ్లు.. ఈ వయస్సులోనూ సాహాసోపేత బైక్ రైడ్ చేపట్టి.. ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్ టు లడఖ్..లడఖ్ టు కన్యాకుమారి టు.. హైదరాబాద్ ఇలా సోలో బైక్ రైడ్‌తో దేశభక్తి చాటుతూ..జాతీయ జెండాను రెపరెపలాడించారు.
‘ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశా.. దేశం కోసం, ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’. అని శివన్కుట్టి అన్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)