e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Home News పాత‌బ‌స్తీలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. శ‌రీరంపై క‌త్తిపోట్లు

పాత‌బ‌స్తీలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. శ‌రీరంపై క‌త్తిపోట్లు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. చాంద్రాయ‌ణ‌గుట్ట ప‌రిధిలోని బండ్ల‌గూడ‌లోని ఓ రోడ్డుపై వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు.

ఆ ప‌రిస‌రాల‌ను పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. వ్య‌క్తి మృత‌దేహంపై క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. శ‌రీరంపై దుస్తులు లేని స్థితిలో మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆ డెడ్‌బాడీ ప‌క్క‌నే ఓ పాయింట్, టీష‌ర్ట్ ల‌భ్య‌మ‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement