Hyderabad | బంజారాహిల్స్,మార్చి 21: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహమత్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి (26) జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని హోటల్లో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్గా పని చేస్తోంది.
అక్కడే హౌస్ కీపింగ్ పనిచేసే ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ్ అనే వ్యక్తి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. గట్టిగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెప్తే అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. అతని వ్యవహారంపై యువతి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. రెండు రోజులు గడిచినా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత యువతి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఆనంద్ కుమార్ శ్రీవాస్తవ మీద బి ఎన్ ఎస్ 75(1)79,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.