Heart Stroke | శంషాబాద్ రూరల్, మార్చి 5 : ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖత్తర్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పోలీసులు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం క్యూఆర్ -642 నంబర్ ఖత్తర్ విమానం దోహ నుంచి బంగాదేశ్‌కు వెళ్తుంది. బుధవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ఓ ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో ఫైలెట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు.
దీంతో ల్యాండింగ్ చేసి సదరు ప్రయాణికురాలిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అపోలో దవాఖానకు తరలించారు. ఖత్తర విమానం తిరిగి 3.42 నిమిషాలకు తిరిగి వెళ్లిన్నట్లు తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతూ మహిళ ప్రయాణికురాలు రోషానారా(45) మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన రోషానారా మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.