కందుకూరు, అక్టోబర్ 17 : మహేశ్వరం గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తామని జడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తెలిపారు. దాసర్లపల్లి, మాదాపూరు గ్రామాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంతో అభివృద్ధి కృషి చేశారని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, రైతు బంధు అధ్యక్షుడు కృష్ణారాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ మహేశ్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పొలెమోని బాలమణి అశోక్ ముదిరాజ్, మంద సాయిలు, మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్‌రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు సొలిపేట అమరేందర్‌రెడ్డి, అశోక్ ముదిరాజ్, దేవీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ బాల్‌రాజ్, బాల్‌రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా మండల కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఎగ్గిడి గణేశ్, శ్రీశైలం, విష్ణు, కుమార్, శ్రీనివాస్, నర్సింహ పాల్గొన్నారు.
Surender Reddy
మీర్ఖాన్పేట్ గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు, కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు చిర్ర సాయిలు, పీఏపీఎస్ మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అలీ, బర్కం వెంకటేశ్, గ్రామ అధ్యక్షుడు కాసొజు శివప్రసాద్ చారి, కాకి రవీందర్, హనుమంత్ యాదవ్, దేశం కృష్ణారెడ్డి, సురుసాని సుదర్శన్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, సర్పంచ్ బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్, ఎంపీటీసీ కాకి రాములు, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, గండు నర్సింహ, వెంకటయ్య, చంద్రశేఖర్, నర్సింహ, రాఘవేందర్, వెంకటేశ్, శ్రీనివాస్, మహేందర్, పాండు యాదవ్, మహేందర్ యాదవ్, కిషన్‌జీ పాల్గొన్నారు.