మైలార్దేవ్ పల్లి : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో గంజాయి గ్యాంగ్ మరో సారి రెచ్చి పోయింది. శాస్త్రీపూరంలో మహ్మద్ ఫహాద్ ఖాన్(19) అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫహాద్‌ను స్థానికులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. సదరు యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, పాత కక్షల నేపద్యంలోనే ఫహాద్ పై దాడి చేసినట్లు తెలిసింది.
షానవాజ్, షాబాజ్ తో పాటు మరో ముగ్గురిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్యా యత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, వరుస దాడులతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు గస్తీని పెంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.