బాలానగర్, ఫిబ్రవరి 2 : బాలానగర్‌లో ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం..ఏపీ రాష్ట్రం, రాజమండ్రికి చెందిన జలగం సాయి సత్య శ్రీనివాస్ (30) రెండేళ్ళ క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాలవారు వారి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ బాలానగర్ డివిజన్, దామోదరం సంజీవయ్యకాలనీలో నివాసముంటూ పటాన్చెరు రుద్రారంలో ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతడి భార్య విజయనగరంలో నివాసముంటూ కాపురానికి రావడం లేదు….మరో వైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా యి . అప్పుల బాధలు అధికం కావడంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా..? నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయా?..లేదా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడా? అనే కోణంలోను దర్యాప్తు చేపట్టారు.