కాచిగూడ : ఈ నెల 11న ఫతేనగర్‌కు వెళ్లడానికి కాచిగూడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కబోయి జారిపడిన యువకుడు రెండు కాళ్లు కోల్పోయాడు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ఏరియాలోని ఫతేనగర్ ప్రాంతానికి చెందిన శివశంకర్ రావు కుమారుడు భూస కళ్యాణ్ కుమార్ (26) ఐఐటీ పూర్తిచేశాడు.
ఈనెల 11న కాచిగూడకు వచ్చిన అతడు ఫతేనగర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. దాంతో రైల్వే పోలీసులు కళ్యాణ్ కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కుటుంబసభ్యుల కోరిక మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.