మల్కాజిగిరి, ఫిబ్రవరి 9 : ప్రమాదవశాత్తు కొబ్బరి చెట్టు నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గౌతంనగర్‌కు చెందిన శీలం బాలయేసు(33) కూలి పనులు చేస్తుంటారు. పనుల నిమిత్తం గౌతంనగర్‌లో కొబ్బరి చెట్టు కొట్టడం కోసం స్నేహితుడితో కలిసి వెళ్లాడు.
పనులు చేస్తుండగా సాయంత్రం చెట్టు పైనుంచి పడిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, గాంధీ దవాఖానకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.