Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ మధురా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని యూసుఫ్‌గూడలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మెహరీన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్
మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం.
యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి pic.twitter.com/wkiW7kmEla
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024