Murder | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట్( Kokapet )లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్త( Husband )ను కూరగాయల కత్తి( Vegetable Knife )తో విచక్షణారహితంగా పొడిచి చంపింది.
వివరాల్లోకి వెళ్తే.. అసోంకు చెందిన కృష్ణజ్యోతి బోరా, భారకా బోరా అనే దంపతులు నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూడా దినసరి కూలీలు. అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
గురువారం రాత్రి కూడా దంపతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భార్య.. తన భర్తను మట్టుబెట్టాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూరగాయలు కట్ చేసే కత్తితో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితుడు గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు ఆ ఇంటి వద్దరకు చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు.