ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతూ జారీ చేసిన జీవో 45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఓయూ మెయిన్ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడంతో విద్యార్థి, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వయోపరిమితి పెంపుపై ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా అడగలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.