Gymnastics | జూబ్లీహిల్స్, జూలై 8 : నగరానికి చెందిన విష్ణు నగర్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ (విఎన్సీ ) చిన్నారులు జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో పతకాల పంట పండించారు. కొల్లూరులో గత రెండు రోజులుగా జరిగిన జిమ్ క్విన్-2025 ఆలిండియా లెవెల్ జిమ్నాస్టిక్స్ కాంపిటిషన్లో అద్భుత ప్రదర్శనతో 8 బంగారు పతకాలు, 43 వెండి, 38 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అబ్బురపరిచే విన్యాసాలతో అలరించిన పలువురు చిన్నారులు తృటిలో బంగారు పతకాలను చేజార్చుకున్నారు.
బాలికల అండర్ 8-10 విభాగంలో ఏపీ నయోనిక, నియా వర్మలు వరుసగా 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్స్, ఎం. పూజిత 1 సిల్వర్, 3 బ్రాంజ్, రీత్ 3 సిల్వర్, 1 బ్రాంజ్, అండర్ 10-12 విభాగంలో ప్రియన్సీ సాహు 3 సిల్వర్ మెడల్స్‌తో మురిపించారు. బాలికల అండర్ 12-14 విభాగంలో నిశిక్ గోలేచా 1 సిల్వర్, 2 బ్రాంజ్లు, ఆర్. బాల శనైరా, ఆక్రితి అగర్వాల్‌లు వరుసగా 2 సిల్వర్ 2 బ్రాంజ్లు సొంతం చేసుకున్నారు. బాలుర అండర్ 6-8 విభాగంలో ఎన్. కుషిల్ ఖత్వాంగ్ 2 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్, టి. ఎస్.వషిష్ట్ సింగ్, ఎన్. హర్షిల్ హెరాంబ్లు వరుసగా 1 సిల్వర్, 5 బ్రాంజ్‌లతో అబ్బురపరిచారు. బాలుర అండర్ 12-14 విభాగం లో ఎం. ఆకాష్ 2 గోల్డ్, 4 సిల్వర్లు, ఎన్. స్నేహిత్ చౌదరి 1 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్, ఆర్. బాల యువైన్ 1 సిల్వర్, 5 బ్రాంజ్ లు, ఎస్. అర్జున్ రామ్ తేజ్ 2 సిల్వర్, 4 బ్రాంజ్‌లతో ఆకట్టుకున్నారు. బాలుర అండర్-10 విభాగంలో బి. రోహిత్ రెడ్డి 3 సిల్వర్ లు, కె. మోహిత్ కుమార్ 4 సిల్వర్లు, ఎం. వీక్షిత సాయి 1 గోల్డ్, 4 సిల్వర్ పథకాలతో పాటు అండర్ 12-13 విభాగంలో బి. సిద్ది వినాయక 1 బ్రాంజ్, 5 సిల్వర్ లతో మెరిశారు. జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో అద్భుత ప్రదర్శన చేసిన చిన్నారులను జిమ్నాస్టిక్స్ చీఫ్ కోచ్ (వీఎన్‌సీ), విష్ణునగర్ జిమ్నాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రధాన కార్యదర్శి బి. బాలరాజ్ మంగళవారం స్థానిక స్టేడియంలో బాలికల కోచ్‌లు కాంబ్లె రంజిత, కాంబ్లె సరితలతో కలిసి అభినందించారు.