Hyderabad | హిమాయత్ నగర్, ఫిబ్రవరి26 : ఓ మైనర్ బాలికను మభ్యపెట్టి వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బుధవారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణగూడ, కాచిగూడ చౌరస్తాలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండే 60 ఏళ్ల వృద్ధుడు, అతని ఇంటి సమీపంలో ఉన్న 9వ తరగతి చదివే బాలిక(14)పై కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి అపార్ట్మెంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక భయాందోళనలతో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆరా తీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను భరోసా సెంటర్కు పంపించి, స్టేట్మెంట్ ను రికార్డు చేయించారు. ఈ కేసులో రాజీ ప్రయత్నాలు సాగుతున్న ట్లు సమాచారం. ఈ కేసును ఎస్సై నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు.