Hyderabad | హైదరాబాద్ : మొన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను వేటకోడవలితో హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మాదిరి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ పావని అనే మహిళ కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని తాను సేవించడంతో పాటు తన నాలుగున్నరేండ్ల వయస్సున్న కూతురు జస్వికకి తాగించింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి జస్విక మరణించింది. తల్లి కృష్ణ పావని ఐసీయూలో చికిత్స పొందుతుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఆదిత్య గార్డెన్లో జరిగిన ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.