Hyderabad | మెహిదీపట్నం, ఫిబ్రవరి 21 : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మజీద్ హుస్సేన్, 108 సిబ్బంది కలిసి ప్రాణాలతో కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. శాంతినగర్‌లోని హాకీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఫర్ అపార్ట్మెంట్ లిఫ్టులో అర్నవ్ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఇరుక్కున్నాడు. నాలుగో అంతస్తులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మజీద్ హుస్సేన్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు . పోలీసుల సహకారంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 ఈఎంటి తజుద్దీన్, పైలెట్ సురేశ్ కలిసి బాలుడిని లిఫ్టులో నుంచి తీసుకుని సిపిఆర్ చేస్తూ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి బాలుడి ప్రాణాలను కాపాడారు. 108 సిబ్బందిని, డాక్టర్లను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అభినందించారు.