
హైదరాబాద్ : నగరంలోని రవీంద్రభారతి చౌరస్తాలో ఆదివారం ఓ గూడ్స్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమై అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు మంటలు ఆర్పారు.
ఆటో ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.