Constable Dies | హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ కానిస్టేబుల్ డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది.. సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన కానిస్టేబుల్ని విష్ణుపురి కాలనీకి చెందిన డేవిడ్(31)గా పోలీసులు గుర్తించారు. ఈ కానిస్టేబుల్ ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడి నివాసంలో విషాయఛాయలు అలుముకున్నాయి.