బడంగ్పేట్, ఏప్రిల్ 5: బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, యాతం పవన్‌కుమార్ యాదవ్, సుక్క శివకుమార్, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బడంగ్‌పేట్‌లోని పెద్ద బావి మాల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అక్రమాలకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదన్నారు.
అవినీతి అధికారులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కేఎల్ఆర్ కాదా అని వారు ప్రశ్నించారు. పోయిన అధికారులను తిరిగి తీసుకొచ్చిన ఘనత కేఎల్ఆర్దే అన్నారు. అధికార పార్టీ నాయకుల పనులు చక్కబెట్టడానికి అధికారులు అన్ని విధాల సహకరించారన్నారు. జరిగిన అవినీతి, అక్రమాలపై మేయర్, బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎందుకు స్పందించడం లేదన్నారు. బీజేపీ, నాయకులు మాట్లాడుతున్న మాటలకు అర్ధం లేదన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలన్నారు. బడంగ్పేట్ సర్పంచ్‌గా ఉన్న బీజేపీ నాయకుడు అవినీతికి పాల్పడటం వల్లే చెక్క పవర్ రద్దు చేసినట్లు సర్ణ గంటి అర్జున్ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవినీతికి మున్సిపల్ శాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలన్నారు. పెద్ద బావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, రఘునందన చారి, పుట్టగల్ల సంతోష్, గట్టు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.