బంజారాహిల్స్,ఫిబ్రవరి 22: ఖరీదైన మద్యం బాటిళ్లతో(Liquor bottles) పాటు క్యాష్ కౌంటర్లో నగదును తస్కరించిన ఘటనలో పబ్ సెక్యురిటీ గార్డుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని ఆర్ యూ పబ్‌లో(Are you pub) ఇటీవల రోజువారీ క్యాష్తో పాటు మద్యం స్టాక్‌పై ఆడిటింగ్ నిర్వహిస్తున్న సమయంలో నాలుగురోజులుగా కొన్ని మద్యం బాటిళ్లు తక్కువగా కనిపించాయి.
దీంతో పాటు నగదు తగ్గినట్లు గుర్తించిన పబ్ నిర్వాహకులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఈ నెల16న అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ వద్ద విధులు నిర్వహించే సెక్యురిటీ గార్డు వినీత్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు 5వ ఫ్లోర్‌లోకి ప్రవేశించినట్లు తేలింది.
7 రాయల్ సెల్యూట్, శ్రివాస్రీగల్, మోయెట్ చాన్ మద్యం బాటిళ్లతో పాటు రూ.2లక్షల నగదును తస్కరించి పారిపోయిన విషయాన్ని గుర్తించిన పబ్ మేనేజర్ రయాన్ అహ్మద్ ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.