బంజారాహిల్స్,డిసెంబర్ 18: పరిమితికి మించి శబ్దకాలుష్యం కలిగించేలా డీజే ద్వారా మ్యూజిక్ పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న భవనంలో బౌర్బోన్ అండ్ బ్రీజ్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. బుధవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ విజయ్ అక్కడనుంచి వెళ్తుండగా డీజే ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు తేలింది.
ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దేశిత పరిమితిని మించి శబ్దకాలుష్యాన్ని కలిగిస్తున్న బౌర్బోస్ అండ్ బ్రీజ్ లైసెన్స్‌దారు విద్యానందమూర్తి, యజమాని ధర్మారెడ్డి, మేనేజర్ ఉత్తమ్‌కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ విజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.