Hyderabad | హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో కారు సుమారు 100కి.మీ.వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటన సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలు లేకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.