బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు జూబ్లీహిల్స్లో బీభత్సం సృష్టించింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17), తన స్నేహితుడు(17)తో కలిసి కారులో బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం. 1 నుంచి దుర్గం చెరువు వైపు వెళ్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని బ్రిడ్జి సమీపంలోకి రాగానే అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి కుడివైపు డివైడర్ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో మాదాపూర్ వైపు నుంచి వెళ్తున్న టాక్సీ కారుపై పడింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా.. కారు నడిపిస్తున్న మైనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు టాక్సీ డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.