Car accident : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సాకేత్ రెడ్డి అనే విద్యార్థి మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి.. టెలిఫోన్ స్తంభాన్ని డీకొట్టి బోల్తాపడింది. దాంతో కారు డోర్లు దెబ్బతిని దానిలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అందులోనే ఇరుక్కుపోయారు.
ఇది గమనించిన స్థానికులు అతికష్టం మీద ఆ ఇద్దరినీ బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన సాకేత్‌రెడ్డికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా 146 పాయింట్లు చూపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.