హైదరాబాద్ : ఘట్కేసర్ రైల్వే వంతెన పై( Railway bridge) నుంచి దూకి బీటెక్ విద్యార్థిని( BTech student) ఆత్మయత్నానికి(Committed suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ (Ghatkesar) మండల పరిధి అవుశాపూర్ సమీపంలోని వీబీఐటీ కళాశాలలో బాషపాక నాగమణి (19)అనే విద్యార్థిని బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఘట్కేసర్లోని ప్రైవేట్ హస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఘట్కేసర్లోని రైల్వే వంతెన పైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు యత్నించింది.
ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను ఘట్కేసర్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. వైద్యులు నాగమణికి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ దవఖానకు తరలించారు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.