సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని స్థాపించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వివరించారు. 63వ హోంగార్డు ల ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని శనివారం గచ్చిబౌలిలోని సైబరాబా ద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురికి ప్రశంసా పత్రాలను అందచేశారు. అనంతరం సీపీ మహంతి మాట్లాడుతూ.. 1946లో హోంగార్డుల సంస్థ ఏర్పడిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా హోంగార్డ్స్ రైజింగ్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. హోంగార్డుల వ్యవస్థ అనేది పోలీసు, సాయుధ దళాలు, విపత్తు-ప్రతిస్పందన, ఆర్టీసీ, తదితర సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ప్రతి నిత్యం పోలీసులు, ఇతర సంస్థలకు సహాయకంగా ఉంటూ ప్రజాసేవలో పాల్గొనే హోంగార్డుల సం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోనే తొలిసారిగా గడిచిన జనవరిలో సైబరాబాద్ హోంగార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని స్థాపించినట్లు తెలిపారు.
ఈ సొసైటీ ద్వారా హోంగార్డులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు వారి సంక్షేమ చర్యలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడిందన్నారు. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్‌లో వేతనాలు పొందే ఖాతాలు కలిగిన హోంగార్డుల కు రూ.33 లక్షల ఆరోగ్య బీమాతో పాటు ఓపీ కన్సల్టేషన్, పూర్తిస్థాయి వైద్యపరీక్షలు పొందే వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా తీవ్రమైన అనారో గ్య పరిస్థితులను ఎదురొంటున్న హోంగార్డులు, పోలీసు సిబ్బంది, వారి కుటుం బ సభ్యులకు సకాలంలో సహాయం అందించడానికి సైబరాబాద్ సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. విధి నిర్వహణలో గాయపడిన హోంగార్డులకు ఎలాంటి ఫైనాన్షియల్ గ్యాప్ లేకుండా పూర్తి మెడికల్ రీయింబర్స్ మెంట్‌ను పొడిగించడంతో పాటు సిబ్బంది సంక్షేమంపై సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
అనంతరం.. కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ మాట్లాడుతూ.. పరేడ్ అలవెన్స్‌ను 100 నుంచి 200కి పెంచడం, సహజ, ప్రమాదవశాత్తు మరణాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు సిబ్బందికి అందించిన తరహాలోనే ఉన్ని జాకెట్లు, రెయిన్కోట్లు వంటి వాటిని కూడా సమకూర్చడం జరుగుతుందన్నారు. సైబరాబాద్‌లో ఆరుగురు హోంగార్డులకు హెచ్డీఎఫ్సీ జీతం ఖాతా నుంచి ఒకొకరికి రూ.43ల ప్రమా ద మరణ బీమా అందించడం జరిగిందని, మధ్యప్రదేశ్‌లో విధి నిర్వహణలో మరణిం చిన హోంగా ర్డు అనంతయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎన్నిక ల ఎక్స్ గ్రేషియా మంజూరైందని వివరించారు.
సైబరాబాద్ పరిధిలోని 1050మంది హోంగార్డుల్లో 912 మంది హోంగార్డులు క్రెడిట్ సొసైటీలో చేరినట్లు డీసీపీ సంజీవ్ తెలిపారు. పదవీ విరమణ, అంత్యక్రియల ప్రయోజనాలతో పాటు 46 మంది లబ్ధిదారులకు రూ.92 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగింద న్నారు. సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) గజరావు భూపాల్, మాదాపూర్, బాలానగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ డీసీపీలు రితిరాజ్, సురేశ్ కుమార్, యోగేశ్‌గౌతమ్, రాజేశ్, ఎస్బీ, సైబర్‌క్రైమ్ డీసీపీ సుధీంద్ర, క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి, ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్ డీసీపీ సృజన, మాదాపూర్ ఎస్ఓటీ డీసీపీ శోభన్‌కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, అదనపు డీసీపీ ఎస్కే షమీర్, ఏసీపీ అరుణ్ పాల్గొన్నారు.