మైలార్దేవ్పల్లి: మైలార్దేవరపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిదేండ్ల బాలుడిని టిప్పర్ (Road Accident) ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా విడుదలైంది.
శాస్త్రీపురానికి చెందిన సయ్యద్ రేయానుద్దీన్(8) ఆదివారం తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఎడమవైపు మళ్లింది. దీంతో బాలుడు దాని వెనుక టైర్ కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్
రాజేంద్రనగర్ లో తీవ్ర విషాదం
మట్టి లారీ కింద పడి 8 ఏళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ –రాజేంద్రనగర్ మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నడుస్తుండగా, మట్టి లారీ టైర్ కింద పడి మృతి చెందిన రియాన్ ఉద్దీన్(8) అనే బాలుడు
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ… pic.twitter.com/5C1M0KhJvm
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025