నిమజ్జనం ముగిసినా.. నిర్విరామంగా సేవలు
వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్‌సాగర్'గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగించారు.
- అవశేషాల తొలగింపు
- 7800 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు
- క్లీన్ హుస్సేన్‌సాగర్ లక్ష్యంగా వేగంగా పనులు
- జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చర్యలు
సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ ): వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్‌సాగర్’గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగించారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, పూలు, పత్రిని వెనువెంటనే తొలిగించారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి వరకు హెచ్ఎండీఏ 3300 మెట్రిక్ టన్నులు, జీహెచ్ఎంసీ 4500 మెట్రిక్ టన్నులు.. మొత్తం 7800 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలిగించినట్లు అధికారులు తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలిగించడానికి నిర్విరామంగా కృషి చేశారని, మండపాలు, 74 కొలనుల వద్ద చెత్త సేకరణకు 3వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటల పాటు పనిచేశారని తెలిపారు. ఈ వ్యర్థాలు వెలికితీత సమయంలో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కాగా, వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జీహెచ్ఎంసీలో పనిచేసే ఎంటమాలజీ కార్మికులు నిమజ్జన కొలనులు, బేబీ పాండ్స్ వద్ద చురుకైన పాత్రను పోషిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

