సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : స్కూల్ బస్సులు యమపాశాలవుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో పదుల సంఖ్యలో గ్రేటర్లో స్కూల్ బస్సులు చిన్నారులను చిదిమేశాయి. మళ్లీ ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైంది. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన ఆర్టీఏ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యా సంస్థలు ఎప్పటిలాగానే ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డెక్కించి విద్యార్థులను తరలిస్తున్నాయి. స్కూల్ ప్రారంభం రోజే గ్రేటర్లో 77 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడిచాయి. అధికారుల తనిఖీల్లో ఆ వాహనాలు సీజ్ అయ్యాయి. విద్యా సంస్థలు ప్రారంభమవ్వడానికి ముందే అన్నీ బస్సులు ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అలాంటిది కొందరు అధికారులు తమ పరిధిలోని స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. ఆర్టీఏ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేయకుండా వారి పరిధిలోని అన్నీ స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారిస్తే విద్యా సంస్థల బస్సుల గుట్టు రట్టవుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరగకముందే మేల్కోవాలని పేరెంట్స్ ఆర్టీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ జిల్లాలో 2,234, రంగారెడ్డిలో 5,500, మేడ్చల్లో 4,120 విద్యాసంస్థల బస్సులున్నాయి.
గత విద్యా సంవత్సరంలో జరిగిన ప్రమాదాలివీ?