Crime News | మల్కాజిగిరి, సెప్టెంబర్ 18: మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్ 11న మద్యం మత్తులో ఇంట్లో తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. రాములుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన స్పెషల్ జడ్జి నిందితుడికి ఏడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు.