Secunderabad | మద్యం మత్తులో తల్లిదండ్రులు.. సికింద్రాబాద్ స్టేషన్లో ఏడు నెలల బాలుడు కిడ్నాప్
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన పింకీ దేవి, అజయ్ అనే దంపతులిద్దరూ పటాన్చెరులోని ఇస్నాపూర్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. పింకీ, అజయ్ ఇద్దరూ కలిసి మద్యం తాగే అలవాటు ఉంది.
అయితే సొంతూరుకు వెళ్లేందుకు దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి ఈ నెల 4న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లోకి వెళ్లే ముందే పింకీ, అజయ్ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరిని మరో మహిళ గమనించింది. ఇక నలుగురి పిల్లలపై దృష్టి సారించిన ఆ మహిళ.. అందరి కంటే చిన్నవాడైన ఏడు నెలల బాలుడిని కిడ్నాప్ చేసింది. మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత.. పిల్లాడు కనిపించకుండా పోయాడని పేరెంట్స్ ఆందోళనకు గురై, స్టేషన్ అంతటా వెతికారు. కానీ బాబు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు.. పిల్లాడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. చెన్నైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

