సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, నార్త్‌జోన్ బృందం, కంటోన్మెంట్ శానిటరీ ఆఫీసర్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్‌లోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
ఎస్ఎస్ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ షాపులపై చేసిన దాడుల్లో హానికరమైన 600 కిలోల చికెన్ వేస్టేజ్, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు, వైన్‌షాపులకు ఈ హానికరమైన చికెన్‌ను సరఫరా చేసేందుకు చికెన్ షాపుల ఓనర్లు ప్లాన్ చేసుకున్నారని, విశ్వసనీయ సమాచారంతో తాము దాడులు చేసి నిర్వాహకులు ఎం భాస్కర్, బొట్ట రవీందర్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.