Hyderabad | కొండాపూర్, ఏప్రిల్ 4 : ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లిన వృద్ధుడు తిరిగి రాకుండా పోయాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గండ్రేడ్ లంకకు చెందిన రాయుడు ఏడుకొండలు(60) వారం రోజుల క్రితం చందానగర్ డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న కొడుకు రాయుడు సత్యం దగ్గరికి వచ్చాడు.
ఈనెల 2వ తేదీన కిరాణా దుకాణానికి వెళుతున్నాను అంటూ ఇంట్లో నుంచి వెళ్లిన ఏడుకొండలు ఎంతకి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసినవారిని, బంధువులను ఆరాతీయగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించిన సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.