డివిజన్ అభివృద్ధికి రూ.6.36కోట్లు
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.6.36 కోట్లు మంజూరు చేశారని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు.
- వెల్లడించిన కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి
బంజారాహిల్స్,ఫిబ్రవరి 8: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.6.36 కోట్లు మంజూరు చేశారని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్ కవితారెడ్డి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. ఇటీవల డివిజన్ పరిధిలో చాలా ప్రాంతా ల్లో సీవరేజ్లైన్ పనులు పూర్తయ్యాయని, ఆయా ప్రాంతా ల్లో సీసీ , వీడీసీసీ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం రూ.5.10కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో దేవరకొండబస్తీ, ఆరోరాకాలనీ, వెంకటేశ్వరనగర్, ఓల్డ్ వెంకటేశ్వరనగర్, యూబీఐ కాలనీ, శ్రీనికేతన్ కాలనీ, గౌరీశంకర్ కాలనీ, జర్నలిస్టు కాలనీ, సింగాడబస్తీ తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని కార్పొరేటర్ తెలిపారు. దీంతో పాటు శ్రీనగర్‌కాలనీ, సింగాడబస్తీ, షౌకత్నగర్, ప్రతాప్‌నగర్ తదితర ప్రాంతాల్లో సీవరేజ్లైన్లు, మంచినీటి లైన్ల కోసం మంత్రి కేటీఆర్ రూ.1.26 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

