మేడ్చల్, జూలై 22 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలోని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 489 చెరువులు ఉండగా, ఇప్పటి వరకు 51 చెరువులు నిండినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు పడుతుండటంతో చెరువులను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 24.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుండిగల్ మండలంలో 45.9 మిల్లిమీటర్లు, అత్యల్పంగా మేడిపల్లిలో 8.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సర్వీసు రోడ్డు మీదుగా..
హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు తెరవడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్ సర్వీసు రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ఆ రహదారిని మూసివేశారు.
– బండ్లగూడ, జూలై 22
జంట జలాశయాల వివరాలు
హిమాయత్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1763.25 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.875 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 3500 క్యూసెకులు
అవుట్ ఫ్లో : 4120 క్యూసెకులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 6
ఉస్మాన్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1785.85 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.90 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 300 క్యూసెకులు